ఆంధ్రప్రదేశ్‌లో గులాబ్‌ తుఫాను ప్రభావితమైన వారికి ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ చేయూత

ఆదివారం, 10 అక్టోబరు 2021 (16:12 IST)
ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గులాబ్‌ తుఫాను కారణంగా ప్రభావితమైన తమ వినియోగదారులకు చేయూతనందించడానికి ముందుకు వచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఖాళీ చేయించడంతో పాటుగా పలు పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటుచేసి నిత్యావసరాలను, తగిన వైద్య సదుపాయాలు, తాగునీటి అవసరాలనూ అందించారు.
 
ఈ పరీక్షా కాలంలో తమ వినియోగదారులకు చేయూత అందించడానికి ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ముందుకు వచ్చింది. ఎస్‌బీఐ జనరల్‌ బృందం ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా సందేహాలకు తగిన సలహాలను అందించడం, క్లెయిమ్‌లను వేగవంతంగా పరిష్కరించడం చేస్తున్నారు. తమకు వస్తున్న సమాచారం పర్యవేక్షించడంతో పాటుగా అన్ని సందేహాలనూ నివృత్తి చేసేలా తగిన చర్యలను తీసుకున్నారు.
 
 
ఈ క్లెయిమ్‌ ప్రక్రియలో ఆలస్యం నివారించడానికి ఈ కంపెనీ ఓ సర్వేయర్‌ బృందాన్ని అందుబాటులో ఉంచింది. ప్రభావిత వినియోగదారులలో 10 లక్షల రూపాయల వరకూ నష్టపోయిన వారి కోసం ఎక్స్‌ప్రెస్‌ క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌ ప్రక్రియను ఎస్‌బీఐ జనరల్‌ అనుసరిస్తుంది. చిన్న మొత్తాల క్లెయిమ్‌లను తక్షణమే ఎస్‌బీఐ జనరల్‌ పరిష్కరిస్తూ ప్రభావిత వినియోగదారులు త్వరగా కోలుకునే అవకాశం అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు