ఇక ఈ ఏడాది వసూలైన రూ.1,12,020 కోట్లలో కేంద్ర జీఎస్టీ రూ.20,522 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.26,605 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
గత అక్టోబరు నుంచి జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల పైగానే ఉంటూ వచ్చాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూన్ నెలలో ఈ వసూళ్లు రూ. 92,849 కోట్లకు పడిపోయాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.