ఆరోగ్యం, వెల్‌నెస్‌ ప్రయోజనాలతో సూర్యోదయ్‌ బ్యాంక్‌ ప్రీమియం సేవింగ్స్‌ ఖాతాలు

మంగళవారం, 3 ఆగస్టు 2021 (19:56 IST)
సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంక్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ) తమ ప్రీమియం సేవింగ్స్‌ ఖాతా ‘సూర్యోదయ్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సేవింగ్స్‌ ఖాతా’ను విడుదల చేసింది. దీనిద్వారా  వినియోగదారుల సంపద వృద్ధి చెందడం మాత్రమే కాదు, కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో ఖాతాదారులతో పాటుగా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం సైతం కాపాడబడుతుందనే భరోసానూ అందిస్తుంది.
 
ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో పాటుగా ఈ నూతన సేవింగ్స్‌ ఖాతా మూడు ముఖ్య ప్రయోజనాలను నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబం (స్వీయ, భర్త/భార్య మరియు ఇద్దరు పిల్లలు)కు 25 లక్షల రూపాయల టాపప్‌ ఆరోగ్య భీమా,  వార్షిక ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీ మరియు ఆన్‌ కాల్‌ అత్యవసర అంబులెన్స్‌ మెడికల్‌ కేర్‌ సేవలతో అందిస్తుంది.
 
టాపప్‌ ఆరోగ్య భీమా మరియు హెల్త్‌కేర్‌ ప్యాకేజీలు ఖాతా తెరిచిన తొలి సంవత్సరం ఉచితంగా అందిస్తారు. ఉచిత అంబులెన్స్‌ సేవలను దేశ వ్యాప్తంగా 102 ప్రాంతాలలో 20 కిలోమీటర్ల రేడియస్‌లో మార్చి 2022 వరకూ అందిస్తారు.
 
భారతీయులై ఉండి 18 సంవత్సరాలు-65 సంవత్సరాల వయసు నడుమ కలిగిన వ్యక్తులు సూర్యోదయ్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సేవింగ్స్‌ ఖాతాను స్వయంగా లేదా ఉమ్మడిగా తెరువవచ్చు. సూర్యోదయ్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సేవింగ్స్‌ ఖాతా తెరువడంలో భాగంగా సరాసరి నెల బ్యాలెన్స్‌ ఖాతాలో 3 లక్షల రూపాయలు ఉండాలి. అలాగే తమ ఆరోగ్యం గురించిన డిక్లరేషన్‌ సైతం వారు వెల్లడించాల్సి ఉంటుంది.
 
ఆర్‌ భాస్కర్‌ బాబు, ఎండీ అండ్‌ సీఈవో, సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ మాట్లాడుతూ, ‘‘అత్యవసర వైద్య సేవల ఖర్చు, ఆర్ధికంగా పెనుభారం అవుతుంటుంది. అందువల్ల, మేము సూర్యోదయ్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ఖాతాను పరిచయం చేయడం ద్వారా ఈ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాము. మొత్తం కుటుంబం కోసం సమగ్రమైన ఆర్థిక, ఆరోగ్య ప్రణాళికలో  మేము కూడా భాగం కావాలనుకుంటున్నాం. అందువల్ల, కేవలం వారి సంపద మాత్రమే వృద్ధి చెందడం కాకుండా వైద్య అత్యవసరాలలో వారి జేబు నుంచి ఖర్చు చేసే ఇబ్బంది కూడా తప్పిస్తున్నాం’’ అని అన్నారు
 
సేవింగ్స్‌ ఖాతాలో బ్యాలెన్స్‌ అనుసరించి 4% నుంచి 6% వరకూ వడ్డీని సూర్యోదయ్‌ బ్యాంక్‌ అందిస్తుంది. ఈ బ్యాంక్‌ ఇప్పుడు మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం చేసుకుని టాపప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను; వీహెల్త్‌ ఎట్నాతో భాగస్వామ్యంతో వార్షిక హెల్త్‌కేర్‌ ప్యాకేజీ, జికిట్జా హెల్త్‌కేర్‌ భాగస్వామ్యంతో అంబులెన్స్‌ ఆన్‌ కాల్‌ సేవలను అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు