అలాగే, ఐటీశాఖ నిబంధనల ప్రకారం ఒక్కో ఖాతాలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ నగదు ఉంటే ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాల్లో రూ.50 వేల వరకు జమచేసుకోవచ్చని తెలిపింది.
కొన్ని ఖాతాల్లో అసాధారణ, అనుమానాస్పద రీతిలో పెద్దమొత్తంలో నగదు జమ అవుతున్నట్టు గుర్తించింది. ఈ విషయమై ఫిర్యాదులు అందుకున్న ఐటీశాఖ అక్రమార్కుల పనిపట్టేందుకు సిద్ధమైంది. ఇతరుల ఖాతాల్లో నగదు జమ చేసే వారికి ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.