తిరుపతి: భారతదేశపు ప్రముఖ ఆన్-డిమాండ్ సౌకర్యవ వ్యవస్థ స్విగ్గీ లిమిటెడ్ తిరుపతిలో 99 స్టోర్ ఆఫర్ పై భారీ పెట్టుబడి పెడుతున్నట్లు ఈ రోజు తెలియచేసింది. జులైలో ప్రారంభించిన ఫ్లాట్ రూ. 99కి విస్తృత శ్రేణి వంటకాలను ఇకో సేవర్ విధానం ద్వారా ఉచితంగా డెలివరీ చేసే ఈ కొత్త ఆఫరింగ్ కోసం కస్టమర్ల నుండి అనూహ్యమైన ప్రతిస్పందన లభించిందని కూడా కంపెనీ తెలియచేసింది. విలువ- చైతన్యం కలిగిన వినియోగదారులు, Z తరం యూజర్ల కోసం రూపొందించబడిన ఈ ఆఫరింగ్ తిరుపతిలో రోజూ ఏవిధంగా ఆహారం తింటారో ఇప్పటికే మార్చింది.
పులిహోర, ఆంధ్రా థాలీ, బిసి బెళ బాథ్, ఇంకా ఇతర వంటకాల పట్ల గల ఆదరణకు ప్రసిద్ధి చెందిన తిరుపతి 99 స్టోర్‌ను ఉత్సుకతతో ఆహ్వానించింది. తిరుపతి 99 స్టోర్ స్విగ్గీ సరసమైన ధర, ప్రామాణికతలను సమతుల్యం చేసే మెనూను రూపొందించడానికి స్థానిక రెస్టారెంట్ భాగస్వాములతో కలిసి పని చేస్తోంది. ఇది ప్రారంభమైన నాటి నుండి, తిరుపతిలో 99 స్టోర్‌కి జనాల తాకిడి ఎక్కువైంది. బిర్యానీ స్థానికంగా అభిమానించే వంటకంగా మారింది. ఈ వంటకాలు నగర ప్రజల శీఘ్రమైన, రుచి నిండిన, సరసమైన ధరలతో పాటు కడుపు నింపే భోజనాల పట్ల ప్రాధాన్యతను తెలియచేస్తున్నాయి.
ప్రియమైన నగర రుచులను రూ.99 స్టోర్‌కు తీసుకురావడానికి ద పారడైజ్, హాట్ స్పాట్, క్వాలిటీ స్పైసీ ఫ్యామిలీ రెస్టారెంట్ వంటి ప్రముఖ స్థానిక రెస్టారెంట్లు స్విగ్గీతో భాగస్వామం చెందాయి. ఈ రెస్టారెంట్లు తమ మెనూల నుండి ప్రసిద్ధి చెందిన పదార్థాలను అందచేసాయి, ఆఫరింగ్ స్థానిక అభిరుచులకు తగిన విధంగా అందచేయడాన్ని నిర్థారిస్తున్నాయి. తిరుపతిలో వినియోగదారుల నుండి ఆరంభంలో అనూహ్యమైన ప్రతిస్పందన వచ్చింది. డబ్బు ప్రతిపాదన కోసం విలువను, వివిధ రకాల వంటకాలను, ఉచిత డెలివరీ సౌకర్యాన్ని స్విగ్గీ యూజర్లు ప్రశంశించారు. లంచ్ విరామాలు, కాలేజీ భోజనాలు, లేదా అర్థరాత్రి తినాలని కోరుకునే వారి కోసం ఇది ప్రధానమైన వేదికగా నిలిచిందని చాలామంది చెప్పారు.
తిరుపతిలో 99 స్టోర్ ఆఫరింగ్ గురించి మాట్లాడుతూ, సిద్ధార్థ భకూ, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, స్విగ్గీ ఇలా అన్నారు. 99 స్టోర్ కేవలం కొత్త ఆఫరింగ్ మాత్రమే కాదు, ఇది ఒక నిబద్ధత కూడా. యువ కస్టమర్లు సహా విస్తృత శ్రేణి యూజర్లలో మంచి భోజనం సరసంగా, సిద్ధంగా అందుబాటులో ఉంచడానికి చేసిన నిబద్ధత. మా యూజర్లకు అవసరమైన-విలువ, విభిన్నత, సౌకర్యం గురించి మేము విన్నాము. అందుకే రోజూ తినే భోజనాలు మీకు వ్యయభరితంగా లేకుండా నిర్థారించే లక్ష్యంతో మేము 99 స్టోర్‌ను ప్రారంభించాము. మా రెస్టారెంట్ భాగస్వాములతో సన్నిహితంగా పని చేయడం ద్వారా, తిరుపతి మంచి రుచి, మంచి డీల్‌ల మధ్య ఎన్నడూ ఎంచుకోదని మేము నిర్థారిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది యూజర్ల కోసం స్విగ్గీ అనేది ప్రాధాన్యత ఇవ్వబడిన రోజూవారీ ఎంపిక దిశగా రూ. 99 ధర అంశం ఒక ముందడుగు అని చెప్పవచ్చు.
99 స్టోర్ ఆఫరింగ్ గురించి మాట్లాడుతూ, జయ శంకర్, యజమాని, ద పారడైజ్, ఇలా అన్నారు, మా కస్టమర్ల నుండి మేము సానుకూలమైన ప్రతిస్పందన అందుకున్నాము. మా 99 స్టోర్ ఆఫరింగ్స్ ఒక గొప్ప హిట్‌గా నిలిచాయి. మా సింగిల్-సర్వ్ బిర్యానీలు కస్టమర్‌కు ఇష్టమైనవిగా మారాయి. ఈ పరిపూర్ణమైన భోజనాలు వ్యక్తులకు ఉత్తమమైనవి, రుచి లేదా నాణ్యతలో రాజీ లేకుండా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. స్విగ్గీతో, మేము మా వద్దకు వచ్చే ప్రజల సంఖ్యను పెంచుకోగలిగాము. మెరుగ్గా కస్టమర్లు పాల్గొనడాన్ని నిర్థారించాము, ఇది మా ఆఫ్ లైన్ వ్యాపారాన్ని పెంచుకోవడంలో సహాయపడింది, అదే సమయంలో స్థానిక మార్కెట్లో రెస్టారెంట్ యొక్క ఉనికిని కూడా మెరుగుపరిచింది.
సురేంద్ర రెడ్డి, యజమాని, క్వాలిటీ స్పైసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇలా అన్నారు, గొప్ప ఆహారం ఎక్కువ ధరకు లభించదని మేము విశ్వశిస్తాము. అందుకే మేము ప్రామాణిక రుచి, ఉన్నతమైన నాణ్యత, నిజమైన విలువలను కలిపిన భోజనాలను అందచేయడానికి మేము కట్టుబడ్డాము. మా రెస్టారెంట్లో ప్రతి వంటకం తాజా పదార్థాలతో, సంప్రదాయమైన వంటకాలతో తయారైంది, స్థిరమైన, గుర్తుండిపోయే రుచిని నిర్థారిస్తుంది. నాణ్యత లేదా పరిమాణంపై ఎలాంటి రాజీ లేకుండా అందరి కోసం సరసమైన మెనూగా ఉండటానికి మేము మా మెనూని జాగ్రత్తగా రూపొందించబడింది. రుచి, నాణ్యత మరియు ధరల యొక్క ఈ ఆలోచనాత్మకమైన సమతుల్యత మా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించడంలో మాకు సహాయపడింది- ఎన్నోసార్లు మళ్లీ మళ్లీ మా విధేయులైన అతిథులు వచ్చేలా ఉంచుతూనే కొత్త వారిని కూడా ఇది ఆకర్షిస్తోంది.