భారత్‌లోని 130 నగరాలపై కన్నేసిన స్విగ్గీ.. త్వరలో బ్రాంచ్‌లు

మంగళవారం, 8 అక్టోబరు 2019 (11:38 IST)
ఆన్‌లైన్ ద్వారా ఆహార పదార్థాలను డోర్ డెలివరీ చేసే స్విగ్గీ సంస్థ భారత్‌లో మాత్రం తమ వ్యాపారాన్ని విస్తరించే దిశగా రంగం సిద్ధం చేసోంది. స్విగ్గీకి ఆర్డర్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. భారత్‌లో మాత్రం 130 నగరాల్లో తమ బ్రాంచ్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. భారత్‌లో స్విగ్గీకి పెరుగుతున్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ చర్యలు తీసుకుంటోంది. 
 
భారత్‌లో ఇప్పటికే 500 నగరాల్లో స్విగ్గీ తమ విధులను నిర్వర్తిస్తోంది. ఇంకా ఈ ఏడాది చివరి నాటికి 200 యూనివర్శిటీల్లో తమ బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా భారత్‌లో అదనంగా మరో 130 నగరాల్లో తమ బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
దీని ప్రకారం కర్ణాటకలోని బాల్‌కోట్, ఆంధ్రాలోని హిందూపురం, మహారాష్ట్రలోని సవంద్వాడీ, సగంనర్, తమిళనాడులోని రామనాథపురం, శివకాశిలతో  పాటు 130 నగరాల్లో స్విగ్గీ బ్రాంచ్‌లు ప్రారంభం కానున్నాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు