ఈ మొత్తం అనేక రైళ్లలో 80, 90 శాతం వరకు పెరుగుతోంది. సికింద్రాబాద్ - తెనాలి థర్డ్ ఏసీ ప్రాథమిక ఛార్జి రూ.610 అయితే 30 శాతం అదనంతో రూ.800.. రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ ఛార్జీలతో రూ.900 లోపే ఉండాలి. కానీ రూ.1,150 మేరకు వసూలు చేస్తుంది.
అదేవిధంగా స్లీపర్ క్లాస్‌లో రూ.100 - రూ.200, థర్డ్ ఏసీలో రూ.300- రూ.400, సెకండ్ ఏసీలో రూ.400-500 అదనంగా వసూలు చేస్తోంది. 200 నుంచి 400 కి.మీ. దూరం వరకు ప్రయాణించేవారిపై ఈ భారం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రైల్వేశాఖ ఏసీ తరగతులకు కనీస దూరంగా 500 కి.మీ. పరిగణనలోకి తీసుకోవడమే దీనికి కారణం.