జనవరి-సెప్టెంబర్‌ మధ్యకాలంలో గృహ విక్రయాల వృద్ధి 12%: ప్రాప్‌టైగర్‌

బుధవారం, 17 నవంబరు 2021 (17:59 IST)
గృహ విక్రయాలు 12% వృద్ధి చెంది జనవరి-సెప్టెంబర్‌ మధ్యకాలంలో 1,38,051 యూనిట్లు విక్రయించబడ్డాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 1,23,725 యూనిట్ల విక్రయం జరిగింది అని ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ విడుదల చేసిన రియల్‌ ఇన్‌సైట్‌ రెసిడెన్షియల్‌ క్యు3, 2021 నివేదిక వెల్లడించింది.
 
‘‘డిమాండ్‌ పెరగడంతో పాటుగా పండుగ విక్రయాలు పెరగడం, భారతీయ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడంతో పాటుగా ఉద్యోగ మార్కెట్‌ సైతం కోలుకోవడం, వడ్డీరేట్లు తగ్గడం చేత గత సంవత్సరంతో పోలిస్తే 15-20% విక్రయాలు పెరిగాయి. ఈ జూలై నుంచి విక్రయాలు కూడా పెరిగాయి’’ అని రాజన్‌ సూద్‌, బిజినెస్‌ హెడ్‌,ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.
 
‘‘రెసిడెన్షియల్‌ రియల్‌ మార్కెట్‌ పునరుద్ధరించబడినప్పటికీ, 2019తో పోలిస్తే ఈసంఖ్యలు తక్కువగానే ఉన్నాయి. మార్కెట్‌ అంచనాల ప్రకారం గృహ విక్రయాలు రెండంకెల వృద్ధిని అక్టోబర్‌-డిసెంబర్‌ కాలంలో నమోదు చేశాయి’’ అని అన్నారు. ‘‘భారతదేశపు ఆర్థిక వ్యవస్థతో పాటుగా ఉపాధి కల్పన పరంగా రియల్‌ఎస్టేట్‌పరిశ్రమ అందించిన తోడ్పాటు అసాధారణం. అందువల్ల గృహ మార్కెట్‌ కోలుకోవడం అనేది ఇప్పుడు అత్యంత అవసరం’’ అని రాజన్‌ సూద్‌ అన్నారు.
 
‘‘హౌసింగ్‌ డాట్‌ కామ్‌పై ఆస్తులు కోసం వెదకడం పెరిగింది. ఇది రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో సానుకూల వృద్ధిని సూచిస్తుంది. ఈ రంగం వృద్ధి పట్ల సానుకూల అంచనాలను వెల్లడిస్తూ సెప్టెంబర్‌లో అత్యధిక విక్రయాలను చూసింది’’ అని అంకితా సూద్‌, డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌, ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌డాట్‌ కామ్‌ అన్నారు.
 
ఇన్‌పుట్‌ ధరలు పెరుగుతున్నప్పటికీ, గృహ ధరలు మాత్రం స్థిరంగానే ఉంటాయని మేము భావిస్తున్నాం. కొంతమంది బ్రాండెడ్‌ డెవలపర్లు ధరలు పెంచారు అయినప్పటికీ కొనుగోలుదారులు ఈ బిల్డర్లకు చెల్లింపులు చేయడానికి వెనుకాడటం లేదు’’ అని రాజన్‌ సూద్‌ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు