భారత సీనియర్ షట్లర్, భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత సూపర్ స్టార్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రత్యర్థితో జరిగిన మూడు గేమ్‌లలో దూసుకుపోయింది. సింధు 67 నిమిషాల్లో 21-16, 12-21, 21-15 తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమృంగ్‌ఫాన్‌పై విజయం సాధించింది. ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన అనంతరం సింధుకు ఇది తొలి టోర్నమెంట్.
భారతదేశపు గొప్ప ఒలింపియన్లలో ఒకరైన సింధు ఈ టోర్నమెంట్‌తో పునరాగమనం చేయడానికి ముందు కొంత కాలం విశ్రాంతి తీసుకున్నది. భారతదేశానికి చెందిన మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ నుంచి నిష్క్రమించారు. లక్ష్య సేన్ 16 వ రౌండ్‌లో ప్రపంచ నంబర్ 2 విక్టర్ ఆక్సెల్సన్‌తో పోటీ పడగా, సమీర్ వర్మ ఆతిథ్య దేశానికి చెందిన ఆండర్స్ అంటోన్సెన్‌తో ఆడతారు.