ఈ నూతన సంవత్సర వేళ ప్రతి ఒక్కరినీ ‘సెలబ్రేట్‌ ఈక్వెల్‌’ అని అభ్యర్ధిస్తోన్న ఏరియల్‌

గురువారం, 29 డిశెంబరు 2022 (23:45 IST)
గత ఏడు సంవత్సరాలుగా, ఏరియల్‌ ఇండియా ఇంటి పనులను పంచుకోవడంలో అసమానతల పట్ల  చర్చ జరిగేలా కార్యక్రమాలను నిర్వహిస్తూ, 2014 నుంచి మగవారిని సైతం భారం పంచుకోమని కోరుతుంది. 2014లో, ఏరియల్‌ ఉద్యమానికి ముందు, 79% మంది మగవారు ఇంటి పనులు మహిళల ఉద్యోగమని భావించేవారు. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా లక్షలాది మంది పురుషులు తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయినప్నటికీ 41% మగవారు ఇప్పటికీ ఇంటి పనులు మహిళల ఉద్యోగంగానే భావిస్తున్నారు. నేటి తరపు మగవారు, ఎవరైతే మార్పును స్వీకరించడానికి ముందుకు వస్తున్నారో వారు మరింతగా చేయడంతో పాటుగా ప్రతి రోజూ ఇంటి పనులలో భాగం కావడంతో పాటుగా బాధ్యతలను సమానంగా పంచుకుంటున్నారు.

 
ఫ్యామిలీ డిన్నర్లు, పండుగలు, సమావేశాలతో వేడుకలు తిరిగివచ్చాయి. అత్యంత ఆనందోత్సాహాలతో ఇవి జరుగుతున్నాయి. అయితే, లాండ్రీ, క్లీనింగ్‌ లేదా కుకింగ్‌ లాంటి ఇంటి పనులను తరచుగా గుర్తించడం లేదు. నిజానికి వేడుకల సమయంలో ఈ భారం గణనీయంగా పెరగడంతో పాటుగా ఈ భారాన్ని సమానంగా మాత్రం పంచుకోవడం లేదు. ఓ స్వతంత్య్ర సంస్ధ నిర్వహించిన అధ్యయనం ప్రకారం కేవలం 27% మంది మహిళలు మాత్రమే తమ భర్తలు ఈ తరహా వేడుకల సమయంలో భారాన్ని పంచుకుంటున్నారు. ఈ కారణం చేత వేడుకలలో మహిళలు సరిగా పాల్గొనలేకపోతున్నారు.

 
ఏరియల్‌ ఈ మహిళల సెంటిమెంట్‌ను తమ నూతన సెలబ్రేట్‌ ఈక్వెల్‌ చిత్రంలో ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది సంబంధితమైన ప్రశ్న- ‘ఒకవేళ అది సమానం కాకపోతే, మీరు చేసుకునేది అసలైన వేడుకేనా?’ను సంధిస్తుంది. ఈ చిత్రంలో ఫ్యామిలీ డిన్నర్‌ తరువాత ఓ వ్యక్తి సోఫాలో కూర్చుని తన ఫోన్‌ చూస్తుంటాడు. అదే సమయంలో ఆ ఇంటి ఇల్లాలు టేబుల్‌ సర్ధడం, పిల్లలను చూసుకోవడం చేస్తుంటుంది. ఆ వ్యక్తి తన భార్యను ఆ రోజు తమ ఇంటికి వచ్చిన బంధువుల ఫోటోల గురించి చెబుతుంటాడు. అప్పుడు ఆమె తాను కూడా ఉన్న ఫోటో చూపమని అడుగుతుంది. చాలావరకూ చిత్రాలలో ఆమె వెనుక ఇంటి పనులు చేస్తూ కనబడుతుంది తప్ప వేడుకలలో ఎక్కడా కనబడదు.

 
‘‘ఏరియల్‌ వద్ద, మేమెప్పుడూ కూడా ఈ ప్రపంచం కోసం అత్యుత్తమ ప్రపంచాన్ని నిర్మించాలని కోరుకుంటుంటాము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమానంగా చూడబడతారు. గత కొద్ది సంవత్సరాలుగా, మా ప్రచారాలు ద్వారా ఉద్దేశ పూర్వకంగా కాకుండానే చూపే పక్షపాతం మరియు కండీషనింగ్‌ను వెలుగులోకి తీసుకు వస్తూ సమాన అవకాశాలు కలిగిన ప్రపంచాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది’’అని పీ అండ్‌ జీ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ మరియు పి అండ్‌ జీ ఇండియా ఫ్యాబ్రిక్‌ కేర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శరత్‌ వర్మ అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ఇప్పటికి కూడా 61% మంది మహిళలు తామిప్పటికీ పూర్తిగా వేడుకలను ఆస్వాదించలేకపోతున్నామంటున్నారు. దీనికి ఇంటి పనుల భారమే కారణం. తరచుగా ఈ అంశాన్ని గుర్తించకుండా వెళ్లిపోతున్నాము. మా సెలబ్రేట్‌ ఈక్విల్‌ ద్వారా సానుకూల మార్పులను తీసుకురావడానికి తగిన చర్చను తీసుకువస్తున్నాము’’ అని అన్నారు.

 
సమానత్వం తీసుకురావడానికి ఏరియల్‌ కృషి చేస్తుంది. 2015 నుంచి కూడా సమానత్వం, ఇన్‌క్లూజన్‌ వంటి అంశాలపై ఏరియల్‌ కృషి చేస్తుంది. ఇది అత్యంత విలువైన ప్రశ్నలను ఇంటి పనులలో సమానత్వంపై తమ షేర్‌ ద లోడ్‌ ఉద్యమం ద్వారా సంధిస్తూనే, తమ మేక్‌ ఇట్‌ పాజిబల్‌ ప్రచారం ద్వారా తగిన మద్దతునూ అందిస్తుంది. ఈ దిశగా మరో ప్రయత్నం సెలబ్రేట్‌ ఈక్వెల్‌. ఇంటి పనులలో లింగ సమానత్వ కారణాలను మరింతగా పెంపొందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు