ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు.
పచ్చడి తీసుకునేందుకు ఉగాది అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి, ఈ సమయంలో శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింకం దళబక్షణం' అనే మంత్రాన్ని ప్రత్యేకంగా జపించి ఈ పచ్చడిని తీసుకోవాలి. దీనర్థం.. వందేళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం.