దేశంలో భారీగా తగ్గిన బంగారం ధరలు .. ఈ రోజు గోల్డ్ రేట్ ఎంతంటే..?

గురువారం, 19 జనవరి 2023 (10:51 IST)
దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వచ్చిన ఈ బంగారం ధరలకు గురువారం బ్రేక్ పడింది. ఈ వారంలో సోమ, మంగళవారాల్లో పెరిగిన బంగారం ధరలు బుధవారం మాత్రం స్థిరంగా ఉన్నాయి. గురువారం వీటి ధరలు పెరిగాయి.
 
దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. తులం బంగారంపై ఒకేసారి రూ.200 మేరకు తగ్గింది. అయితే, ఈ తగ్గుదల మరిన్ని రోజుల పాటు కొనసాగకపోవచ్చని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే,
 
న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,100గా ఉంది.
 
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 తగ్గి రూ.52,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గడంతో రూ.56,730 వద్ద కొనసాగుతోంది.
 
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,980గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,900గా ఉంది. 
 
బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,781గా ఉంది. 
 
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,730గా ఉంది. 
 
విజయవాడ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,730గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు