నేల చూపు చూస్తున్న బంగారం - వెండి ధరలు

ఆదివారం, 30 అక్టోబరు 2022 (12:22 IST)
బంగారం ధరలు నేల చూపు చూస్తున్నాయి. పండగ సీజన్‌లో భారీగా పెరిగిన ఈ ధరలు ఇపుడు క్రమంగా తగ్గుతున్నాయి. రెండు రోజుల క్రితం పెరిగిన ఈ ధరలు ఇపుడు మళ్లీ తగ్గుతున్నాయి. ఈ నెల 26, 27వ తేదీల్లో హైదరాబాద్ నగరంలో వరుసగా 150, 100 రూపాయల మేరకు తగ్గాయి. ఈ ధరలు ఒక్క రోజు పాటు స్థిరంగా ఉన్నాయి. ఇపుడు మళ్లీ పెరిగాయి. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 మేరకు తగ్గింది. దీంతో అంతకుముందు రోజు రూ.47,100గా ఉన్న ధర ఆదివారం రూ.46,750కు చేరింది. అలాగే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములధర హైదరాబాద్ నగరంలో రూ.380 మేరకు తగ్గింది. దీంతో రూ.51,380 నుంచి రూ.51 వేలకు పడిపోయింది. 
 
వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర ఏకంగా రూ.700 మేరకు తగ్గింది. ఫలితంగా రూ.63,700గా ఉన్న ధర ప్రస్తుతం రూ.63,000 వేలకు చేరుకుంది. పంజ సీజన్ సమయంలో వరుసగా వారం పది రోజుల వ్యవధిలో ఏకంగా రూ.6,500 మేరకు పతనమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు