మరోమారు ఎగిసిపడిన బంగారం ధరలు

శుక్రవారం, 24 డిశెంబరు 2021 (07:41 IST)
దేశంలో పసిడి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు బాగా ఇష్టపడతారు. దీంతో డిమాండ్ పెరగడంతో వీటి ధరలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మరోమారు బంగారం ధరలు పెరిగాయి. 
 
శుక్రవారం బులియన్ మార్కెట్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి, రూ.45,350కు చేరింది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.49,480కి చేరింది. 
 
ఇక వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ.66,200కు చేరుకుంది. ఇపుడు దేశంలో పండగల సజీన్ మొదలు కావడతో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని బంగారం వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు