హైదరాబాద్ నగరానికి చెందిన అరుణా రెడ్డి ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ నుంచి కోలుకున్న ఆమె... ఈ టోర్నీలో ఏకంగా రెండు బంగారు పతకాలను గెలుచుకోవడం గమనార్హం. కాగా, గత 2018 ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ ఈమె కాంస్య పతకం సాధించిన విషయం తెల్సిందే.