దేశంలో పెట్రో మంట ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. పెట్రోల్, డీజల్ ధరలు యధావిధిగా నానాటికీ పెరిగిపోతున్నాయి. మెట్రో నగరాలతో పట్టణ ప్రాంతాల్లో ఈ ధరల భారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతుంది.
గత 11 రోజుల్లో పెట్రోల్ ధర రూ .2.35కి, డీజిల్ ధర రూ.3 వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.02గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.100.89గా ఉంది.
ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.70 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.74 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.108.93 ఉండగా.. డీజిల్ ధర రూ. 100.50గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.103.54 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.92.12 లకు లభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.54కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.92గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.01 ఉండగా.. డీజిల్ ధర రూ.96.60గా ఉంది.