ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో వారంలో హైదరాబాద్‌లోనూ పెట్రోల్ ధర వంద దాటేలా కనిపిస్తోంది. ఇక డీజీల్ కూడా పెట్రోల్‌తో పోటీ పడీ మరీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సోమవారం ప్రధాన నగరాల్లో నమోదైన పెట్రోల్, డీజిల్ ధరలపై ఓ లుక్కేయండి..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.94.76 (ఆదివారం రూ. 94.49), లీటర్ డీజిల్ రూ.85.66 (ఆదివారం రూ.85.38) చొప్పున ఉండగా, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100.98 (ఆదివారం రూ.100.72), లీటర్ డీజిల్ రూ.92.99 (ఆదివారం రూ.92.69)గా ఉంది.
ఇకపోతే, చెన్నైలో సోమవారం ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రూ.96.23 (ఆదివారం రూ.96.08 ), లీటర్ డీజిల్ రూ.90.38 (ఆదివారం రూ. 90.21), హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.98.48 (ఆదివారం రూ.98.20), లీటర్ డీజిల్ రూ.93.38 (ఆదివారం రూ.93.08), విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 100.89 (ఆదివారం రూ.100.73) లీటర్ డీజిల్ రూ.95.19 (ఆదివారం రూ.95) చొప్పున ఉంది.