పెట్రోల్ ధరల పెరుగుదలకు అడ్డేలేదా?

శనివారం, 5 జూన్ 2021 (08:10 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ధరలకు అడ్డుకట్ట వేసే పాలకుడే కనిపించడం లేదు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నాయి. దీంతో పెట్రోల్ ధరల బాదుడు కొనసాగుతూనే వుంది. 
 
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ పక్షం రోజుల వరకు నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలు.. ఆ తర్వాత వరుస బాదుడుతో బెంబేలెత్తిస్తున్నాయి. రోజుకు 10 పైస‌లు, 20 పైస‌లు చొప్పున పెరుగుతూ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఏకంగా రూ.100కు సెంచరీని దాటేశాయి. 
 
ఇక దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే లీట‌ర్ పెట్రోల్‌ ఇప్ప‌టికే సెంచ‌రీ కొట్టేసింది. ఇక శ‌నివారం కూడా ఇంధ‌న ధ‌ర‌ల‌కు బ్రేక్ ప‌డ‌లేదు. తాజాగా దేశంలోని ప్రధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
 
దేశ రాజధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.94.76 గా ఉండ‌గా, డీజిల్ రూ. 85.66 వ‌ద్ద కొన‌సాగుతోంది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌ైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100.98 కాగా, లీట‌ర్ డీజిల్ రూ.92.99 గా ఉంది.
 
ఇకపోతే, చెన్నైలో ఇంధ‌న ధ‌ర‌ల్లో పెరుగుద‌ల క‌నిపించింది. ఇక్క‌డ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.96.23 గా ఉండ‌గా డీజిల్ ధ‌ర రూ.90.38 వ‌ద్ద కొన‌సాగుతోంది. బెంగ‌ళూరులో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.97.92 గా ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ.90.81 వ‌ద్ద కొన‌సాగుతోంది.
 
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల శ‌నివారం కూడా కొన‌సాగింది. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.98.48గా ఉండ‌గా డీజిల్ రూ.93.38 వ‌ద్ద కొనసాగుతోంది.
 
విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ రూ.100.89 వ‌ద్ద ఉండ‌గా.. డీజిల్ రూ.95.19గా ఉంది. విశాఖ‌లో లీట‌ర్ పెట్రోల్ రూ.99.90 కాగా.. డీజిల్ రూ.94.36 వ‌ద్ద కొన‌సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు