ట్రెండ్స్ ‘సెల్పీ విత్ బతుకమ్మ’ కాంటెస్ట్... గ్రాండ్ ప్రైజ్ అందుకోండి

శుక్రవారం, 16 అక్టోబరు 2020 (14:10 IST)
భారతదేశ అతిపెద్ద, శరవేగంగా వృద్ధి చెందుతున్న అపెరల్ మరియు యాక్సెసరీస్‌లకు సంబంధించి రిలయన్స్ రిటైల్ స్పెషాలిటీ చెయిన్ అయిన ట్రెండ్స్ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ అంతటా చిన్న పట్టణాలలో వినియోగదారులకు ఆసక్తిదాయక పోటీలను నిర్వహిస్తోంది. తద్వారా వారితో తన అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోనుంది.
 
బతుకమ్మ అనేది తెలంగాణలో ముఖ్యమైన సాంస్కృతిక పండుగ. గౌరమ్మ పూజలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పండుగ నిర్వహిస్తారు. ఇది మహిళలు నిర్వహించుకునే పూల పండుగ. అమ్మవారిని పూజించేందుకు చేసే అందమైన పుష్ఫా లంకరణ తెలంగాణ  చిన్న పట్టణాల్లో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
 
తెలంగాణ చిన్న పట్టణాల్లో పటిష్ఠ ఉనికి కలిగిఉన్న ట్రెండ్స్ ఆయా చిన్న పట్టణాల్లో కొనుగోలుదారులకు బతుకమ్మ ప్రధానాంశంగా ఆసక్తిదాయక పోటీలను నిర్వహించనుంది.
 
ట్రెండ్స్ ‘సెల్పీ విత్ బతుకమ్మ’ పోటీ
బతుకమ్మ పండుగ సందర్భంగా ట్రెండ్స్ ఆసక్తిదాయకమైన ట్రెండ్స్ ‘సెల్పీ విత్ బతుకమ్మ’ పోటీ ని నిర్వహిస్తోంది. దీని ద్వారా కొనుగోలుదారులతో అనుసంధానమవుతోంది. మహిళలు తమ ఇళ్లలో బతుకమ్మ పుష్పాలంకరణలతో సెల్ఫీలు దిగి వాటిని షేర్ చేసుకునేందుకు గాను మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ట్రెండ్స్.
 
వినియోగదారులు తమ ఎంట్రీలను ట్రెండ్స్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వాట్సాప్ నెంబర్ కు పంపించాల్సి ఉంటుంది. బెస్ట్ బతుకమ్మ డెకరేషన్‌గా ఎంపికైన సెల్ఫీ‌కి గ్రాండ్ ప్రైజ్‌గా, ఒక ఆర్ట్  కాంచీపురం చీర బహుకరించ నున్నారు. తెలంగాణలోని చిన్న పట్టణాలలో ఉండే ప్రతీ ట్రెండ్స్ స్టోర్ కూడా ఒక గ్రాండ్ ప్రైజ్ విజేతను పొందేందుకు వీలుంది. మరిన్ని వివరాలకు దయచేసి మీ పట్టణంలోని ట్రెండ్స్ స్టోర్‌ను సందర్శించండి. ఈ పోటీ అక్టోబర్ 16న ప్రారంభమై అక్టోబర్ 24న ముగుస్తుంది.
 
పోటీకి సంబంధించిన ప్రకటన వినియోగదారులకు వాట్సాప్ సమాచారం ద్వారా తెలియజేయబడుతుంది. అదే విధంగా ట్రెండ్స్ కరపత్రాలు ఇంటింటి పంపిణీ ద్వారా కూడా వినియోగదారులను చేరుకుంటాయి. ఈ చిన్న పట్టణాలకు చెందిన ప్రముఖులు ఈ ఎంట్రీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు.
 
ఎంట్రీలు అందిన తరువాత ట్రెండ్స్ ఆయా దరఖాస్తుదారులకు ‘ధన్యవాదాలు’ సందేశాన్ని పంపిస్తుంది. విజేతల పేర్లను కూడా వాట్సాప్ ద్వారా తెలియపరుస్తారు. ఆయా పట్టణాల్లో గ్రాండ్ ప్రైజ్ విజేతలను ఆయా స్టోర్లకు ఆహ్వానిస్తారు. ఆర్ట్ కాంచీపురం చీరను బహుకరిస్తారు. ఆ పట్టణానికి చెందిన ప్రముఖ మహిళ ఈ బహుమతిని అందిస్తారు. బతుకమ్మ సందర్భంగా మహిళల భక్తిశ్రద్ధలు, పండుగ సందడి వారికి గ్రాండ్ ప్రైజ్‌ను అందించే అవకాశం ఉంది. 
ట్రెండ్స్ సెల్పీ విత్ బతుకమ్మ పోటీలో పాల్గొనండి.
 
తెలంగాణలో బతుకమ్మ స్ఫూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా జరిగే వేడుకల్లో ట్రెండ్స్ పాలుపంచుకుంటోంది. సందర్భానికి తగినట్లుగా తాజా డిజైన్లు మరియు ఆప్షన్లు అందించడం ద్వారా ఆయా స్టోర్స్ ఈ వేడుకల్లో పాల్గొంటున్నాయి. విస్తృత శ్రేణికి చెందిన ఫ్యాషన్ మరియు అందుబాటు ధరల్లో ఉండే ఉత్పాదనలతో ట్రెండ్స్ కొనుగోలుదారులకు తిరుగులేని ఎంపికలను అందించడం ద్వారా ప్రతీ రోజూ ఫ్యాషనబుల్‌గా కనిపించే అవకాశాన్ని ట్రెండ్స్ అందిస్తోంది. ఈ దుస్తులను ధరిస్తే.... అంతా చూసేది వాటినే.... మాట్లాడుకునేది మీ గురించే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు