ఈ ధరల ప్రభావం నిత్యావసర వస్తు ధరలపై కూడా పడింది. ఈ నేపథ్యంలో క్యాబ్ సేవల్లో ప్రముఖ సంస్థగా పేరొందిన ఉబెర్ తన రేట్లను పెంచేసింది. ప్రస్తుతం ఉన్న రేట్లకు అదనంగా 15 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ పెంచిన ధరలు కేవలం ఒక్క ముంబైకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతున్నందున వాటికి అనుగుణంగానే తమ సేవల రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కాగా, త్వరలోనే ఈ పెంచిన రేట్లను దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.