భారత్ NCAPలో స్కోడా ఆటో ఇండియా మొదటి సబ్-4 మీటర్ల ఎస్‌యువి కైలాక్, ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను సాధించింది. దీనితో భారత్ NCAP పరీక్షలో పాల్గొన్న మొట్టమొదటి స్కోడా వాహనంగా కైలాక్ నిలిచి, కుషాక్, స్లావియా నెలకొల్పిన భద్రతా శ్రేష్ఠత బ్రాండ్ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. స్కోడా ఆటో ఇండియా 2.0 కార్లు రెండూ పెద్దలు, పిల్లల ప్రయాణికుల రక్షణ కోసం సంబంధిత గ్లోబల్ NCAP క్రాష్ పరీక్షలలో 5-స్టార్ భద్రతా రేటింగ్‌లను సాధించాయి.
స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జనేబా మాట్లాడుతూ, “భద్రత అనేది స్కోడా జన్యువుల్లో (DNA)లో అంతర్లీనంగా ఉంటుంది. అదేవిధంగా, 2008 నుంచి ప్రతి స్కోడా కారు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో క్రాష్-టెస్టులను ఎదుర్కొని 5-స్టార్ భద్రతా రేటింగ్‌లను దక్కించుకుంది. స్కోడా ఆటో భారతదేశంలో కార్ల భద్రతపై 5-స్టార్ భద్రతా-రేటెడ్ కార్ల సముదాయంతో ప్రచారానికి నాయకత్వం వహిస్తోంది. గ్లోబల్ NCAP పరీక్షల కింద పెద్దలు మరియు పిల్లలకు పూర్తి 5-స్టార్‌లను స్కోర్ చేసిన మొదటి బ్రాండ్‌గా మేము నిలిచాము.
ఇప్పుడు మా సరికొత్త సబ్-4-మీటర్ ఎస్‌యువి (SUV) కైలాక్, భారత్ NCAP పరీక్షలో దాని విభాగంలో చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. సమగ్ర భద్రతా వ్యవస్థలతో వస్తున్న కైలాక్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో సహా విస్తృత శ్రేణి యాక్టివ్, పాసివ్ భద్రతా లక్షణాలు ప్రామాణికంగా ఉన్నాయి. హాట్-స్టాంప్డ్ స్టీల్ వాడకం, రీడోన్ క్రాష్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో కైలాక్‌లో సాధ్యమైనంత ఉత్తమమైన భద్రతను నిర్ధారిస్తుంది. ఈ రేటింగ్ భారతీయ రోడ్లపై యూరోపియన్ టెక్నాలజీని ప్రజాస్వామ్యీకరించడానికి మా నిబద్ధతకు మరింత నిదర్శనం. ఇందులో కారు భద్రతకు ఏర్పాటు చేయవలసిన ఫౌండేషన్లలో ఒకటి అని వివరించారు.
ప్రయాణికుల భద్రతకు స్కోడా కైలాక్ బ్రాండ్ నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తుంది. అన్ని వేరియంట్లలో 25 కన్నా ఎక్కువ యాక్టివ్, పాసివ్ భద్రతా సాంకేతికతలను ప్రామాణికంగా కలిగి ఉంది. బలమైన MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన కైలాక్, భారతీయ రహదారులు, డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా అధునాతన ఇంజనీరింగ్‌ను, వినూత్న లక్షణాలను మిళితం చేస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, హిల్ హోల్డ్ కంట్రోల్, మల్టీ-కొలిషన్ బ్రేకింగ్, XDS+లను బేస్ వేరియంట్ నుంచి ప్రామాణికంగా చేర్చడంతో, కైలాక్ భద్రతకు ఒక కొలమానాన్ని నిర్దేశిస్తుంది. హాట్-స్టాంప్డ్ స్టీల్ నిర్మాణం, పునఃరూపకల్పన చేసిన క్రాష్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ క్యాబిన్ రక్షణను, క్రాష్ స్థితిస్థాపకతను మరింత మెరుగుపరచడంతో దాని సేఫ్టీ-ఫస్ట్ విధానాన్ని బలోపేతం చేస్తాయి.
ముఖ్యాంశాలు:
కైలాక్ అడల్ట్ ఆక్యుపెంట్ రక్షణలో 32.00 (97%)కు 30.88 పాయింట్లు మరియు చైల్డ్ ఆక్యుపెంట్ రక్షణలో 49.00 (92%)కు 45.00 పాయింట్లు సాధించింది. ఇది ICE సబ్-4-మీటర్ కాంపాక్ట్ SUV విభాగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వాహనంగా నిలిచింది.
అడల్ట్ ఆక్యుపెంట్ రక్షణ కోసం ఫ్రంటల్ ఆఫ్‌సెట్ బారియర్ పరీక్షలో, కైలాక్ 16 (94%)కు 15.035 పాయింట్లు సాధించింది. ఆక్యుపెంట్ కంపార్ట్‌మెంట్ మరియు ఫుట్‌వెల్ రెండూ స్థిరంగా రేట్ చేయబడ్డాయి.
అడల్ట్ ఆక్యుపెంట్ రక్షణకు సైడ్-మూవింగ్ డిఫార్మబుల్ బారియర్ పరీక్షలో, కైలాక్ 16 (99%)కు 15.840 పాయింట్లు సాధించింది.
చైల్డ్ ఆక్యుపెంట్ రక్షణ కోసం, కైలాక్ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ బారియర్ పరీక్షలో 16 పాయింట్లు (100%) గరిష్ట స్కోరును, 1.5 మరియు 3 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు సైడ్-మూవింగ్ డిఫార్మబుల్ బారియర్ పరీక్షలో పూర్తి 8 పాయింట్లు (100%) సాధించింది.
సిఫార్సు చేసిన చైల్డ్ సీట్ అసెస్‌మెంట్‌లో కైలాక్ గరిష్ట పాయింట్లను సాధించింది. వాహన ఆధారిత అసెస్‌మెంట్‌లో 13 (69%)కు 9 పాయింట్లను దక్కించుకుంది.