గత ఏప్రిల్‌లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి కోయంబత్తూర్ వరకు చెన్నైలోని వందే భారత్ రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రైలు చెన్నై నుండి కోయంబత్తూరు వరకు నడుస్తుంది. ఇంకా జోలార్‌పేట్, సేలం, తిరుపూర్ మీదుగా రెండు రూట్‌లలో నడుస్తుంది. ఈ రైలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.
ఇకపోతే.. చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు నడపనున్నారు. జూలై 7వ తేదీన ప్రధాని మోదీ వందే భారత్ రైలును వీడియో ద్వారా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ రైలు 130 కిలోమీటర్ల మేర స్పీడుతో నడుస్తుంది. త్వరలో చెన్నై నుంచి తిరునెల్వేలి వరకు స్లీపర్ సౌకర్యాలతో కూడిన కొత్త వందే భారత్ రైలు నడిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.