తాజాగా పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అడ్రా డివిజన్ పరిధిలోని ఓండా స్టేషన్‌కు సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనతో 12కిపైగా వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతకు ఓ గూడ్స్ రైలు ఇంజిన్.. మరో వ్యాగన్‌పైకి చేరింది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగింది. రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.