అంతేగాకుండా.. 'ఇండీ బై అజియో', 'స్వదేశ్' పేరుతో చేపట్టిన కార్యక్రమాల ద్వారా... ప్రస్తుతం ప్రత్యక్షంగా 30 వేల మంది చేతివృత్తి కళాకారులకు లబ్ధి చేకూరుతోందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వస్త్రాలు, చేతికళలు, చేతివృత్తులతో తయారైన సహజమైన వస్తువులు సహా దాదాపు 600 రకాల చేతివృత్తి కళలలకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా స్థానిక చేతివృత్తులు, శిల్పకళా ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు రిలయన్స్ రిటైల్ సంస్థ 'ఇండీ బై అజియో'ను ప్రారంభించింది. దేశంలోని ప్రఖ్యాత సంప్రదాయక చేనేత వస్త్రాలకు కూడా ఇందులో స్థానం కల్పించారు.
గత కొన్నేళ్ల పాటు తాము ప్రారంభించిన చేతివృత్తి అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం మంచి ఫలితాలను ఇస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ అండ్ లైఫ్‌స్టైల్ ప్రెసిడెంట్ అఖిలేశ్ ప్రసాద్ చెప్పారు. పెద్ద సంఖ్యలో చేతివృత్తి కళాకారులకు ఇందులో భాగస్వామ్యం కల్పించడంతో పాటు... మా ఆధ్వర్యంలో రూపొందించిన ఉత్పత్తులను వినియోగదారులు అంగీకరించేలా తీసుకెళ్లగలిగామని ఆయన తెలిపారు.