పెట్రోల్ ధరల తగ్గింపునకు రాష్ట్రాలు వ్యతిరేకం : హర్దీప్ సింగ్ పురి

శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (09:48 IST)
దేశంలో పెట్రోల్, డీజల్, వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజల్ ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. దీంతో ఈ ధరలు సెంచరీ కొట్టాయి. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకొస్తే ధరలు సగానికిపైగా తగ్గుతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. పెట్రోల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడానికి రాష్ట్రాలు సుముఖంగా లేవని, అందువల్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు లేవని తేల్చి చెప్పేశారు. 
 
పెట్రోల్ ధరలు తగ్గాలని కేంద్ర ప్రభుత్వం కూడా కోరుకుంటోందని... కానీ రాష్ట్రాల తీరు వల్ల ధరలు తగ్గే అవకాశం లేదని చెప్పారు. లీటర్ పెట్రోల్ ధరలో కేంద్రానికి వస్తున్న వాటా రూ.32 అని వివరించారు. 
 
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ చమురు ధర 19 డాలర్లుగా ఉన్నప్పుడు రూ.32 పన్ను వసూలు చేశామని... ఇప్పుడు బ్యారెల్ ధర 75 డాలర్లుగా ఉన్నప్పుడు కూడా అంతే వసూలు చేస్తున్నామని గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు