దేశంలో నెంబర్ 1 స్మార్ట్ టీవీ బ్రాండ్ షావోమీ ఇండియా వినియోగదారుల కోసం స్మార్ట్ టీవీ వీక్షణ అనుభవాలను పునరావిష్కరించడమే లక్ష్యంగా రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీని విడుదల చేసింది. సౌకర్యవంతమైన స్ట్రీమింగ్ అనుభవాలను అందించే రీతిలో అంతర్గతంగా నిర్మించిన ఫైర్ టీవీతో రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ వైవిధ్యమైన పిక్చర్ ఇంజిన్, డాల్బీ ఆడియోను తమ శ్రేణిలో అత్యుత్తమ వినోద అనుభవాలను అందించేందుకు తీర్చిదిద్దబడింది.
హై డెఫినేషన్ రెడీ (హెచ్‌డీ-రెడీ) డిస్‌ప్లేను అందించే రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీలో అత్యంత శక్తివంతమైన 20 వాట్ స్పీకర్లు, డాల్బీ ఆడియో, DTS-HD,డీటీఎస్: వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ అలెక్సాతో రెడ్‌మీ వాయిస్ రిమోట్‌తో వస్తుంది. అందువల్ల వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా ఛానెల్స్ మధ్య మారడం, యాప్‌లను త్వరగా ప్రారంభించడం, టైటిల్స్ వెదకడం, సంగీతం ప్లే చేయడం మరియు స్మార్ట్ హోమ్ ఉపకరణాలను తమ గొంతుతో నియంత్రించడం చేయవచ్చు.
క్జియామీ ఇండియా డిప్యూటీ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా సేవలనందిస్తున్న సుదీప్ సాహూ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి కోసం ఆవిష్కరణ అనే మా వాగ్ధానానికి కట్టుబడి, క్జియామీ ఇండియా వద్ద మేము స్ధిరంగా వినియోగారుల స్మార్ట్ టీవీ వీక్షణ అనుభవాలను పునరావిష్కరించడానికి కట్టుబడి ఉన్నాము. అమెజాన్‌తో ఈ భాగస్వామ్యంతో, మేము మా వారసత్వం మరింత ముందుకు తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ అత్యుత్తమ శ్రేణి డిస్‌ప్లే, సౌండ్ పెర్‌ఫార్మెన్స్ మరియు అంతర్గతంగా ఉన్న ఫైర్ టీవీతో రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ ఖచ్చితంగా వినియోగదారుల వీక్షణ అనుభవాలను మెరుగుపరచనుంది అని అన్నారు.