ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ టీ స్టాల్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఫోటోలు కొత్తగా తెరిచిన టీ స్టాల్‌ను పూలమాలలతో అలంకరించారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. "ట్రాన్స్ టీ స్టాల్" అని రాసి ఉన్న బోర్డు చూడవచ్చు. ఈ వీడియోతో పాటు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.