స్టాఫ్ నర్సులకు ఖతార్‌ హాస్పిటల్ స్వాగతం

ఖతార్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధీనంలోని అతి పెద్ద ఆస్పత్రి స్టాఫ్ నర్సులను, మిడ్ వైఫ్‌లను ఆహ్వానిస్తోంది. మూడు రకాల పోస్టులకోసం దేశం నలుమూలలా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది

ఈ రంగంలో డిగ్రీ లేక డిప్లొమా పూర్తి చేసి, గుర్తింపు పొందిన ఆస్పత్రిలో రెండేళ్ల అనుభవం కలిగిన వారిని లేబర్, డెలీవరీ విభాగంలో మిడ్‌వైఫ్‌ల పోస్టులకోసం నియమించనున్నట్టు తెలిపింది. స్వతంత్రంగా సాధారణ ప్రసవాలను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉండాలన్నది ప్రధాన నియమంగా పేర్కొంది.

ప్రసవానంతర అత్యవసర చికిత్సా విభాగంలో స్టాఫ్ నర్సు పదవులకై పైకనిన విద్యార్హతతో పాటు భారీ స్థాయి జాతీయ అత్యవసర చికిత్సా విభాగంలో రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరి.

బయోమెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాలకై డిప్లొమా పూర్తి చేసి, ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఐసీయు, డెంటల్, ఓటీ, లాబ్ పరికరాల వంటి సాధనాలను నిర్వహించడంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి.

ఉచిత, ప్రత్యక్ష ప్రవేశం కల్పించేందుకై ఏప్రిల్ 26వరకు నిర్వహిస్తున్న ప్రిలిమనరీ ఇంటర్వ్యూలకు ఆసక్తి కలిగిన వారు రెస్యూమ్, విద్యార్హత, అనుభవ ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్టు, తాజా ఫోటో గ్రాఫ్‌లతో హాజరు కావాల్సి ఉంటుంది. మే రెండో వారంలో తుది ఇంటర్వ్యూ ఉంటుంది.

ఇతర వివరాలకు ప్లాట్ నెం.14, సంజీవ్ హౌసింగ్ కాలనీ, తూర్పు మారేడు పల్లి, సికిందరాబాద్-26లో సూసమ్మ అబ్రహాంను స్వయంగా కానీ లేక 040-65158930/ 27735444/ 65158524 నెంబర్లో ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు.

వెబ్దునియా పై చదవండి