దక్షిణాఫ్రికాలో క్రేన్, ఎస్కలేటర్ ఆపరేటర్లకు ఛాన్స్

శుక్రవారం, 26 సెప్టెంబరు 2008 (17:00 IST)
FileFILE
దక్షిణాఫ్రికాలో క్రేన్ ఆపరేటర్లు, ఎస్కలేటర్ ఆపరేటర్లు, బాకో జేసీబీ ఆపరేటర్లు, వీల్ లోడర్ ఆపరేటర్లు కావాల్సి ఉంది. సంబంధిత ఉద్యోగానికి సంబంధించి ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అలాగే వీటితో పాటు డీజల్ జనరేటర్లు, రోలర్లు, జేసీబీలకు మరమ్మతులలో పదేళ్ల అనుభవం కలిగిన మెకానిక్‌లకు కూడా ఉద్యోగాలున్నాయి.

వీరికి కనీసం పది సంవత్సరాల పాటు అనుభవం కలిగి ఉండాలి. అలాగే స్టీల్ ఫిక్సర్స్, చట్టరింగ్ కార్పెంటర్, మేసన్స్‌లకు కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. 19-35 ఏళ్లలోపు వయసు కలిగి, అర్హులైన వారు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో పాటు పాస్‌పోర్ట్ కాపీ, సర్టిఫికేట్లతో ఈనెల 29న జరిగే ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.

ఇతర వివరాలకు నెంబర్ 55, అలీ టవర్స్ డీ బ్లాక్- ఎంఎఫ్, గ్రీమ్స్ రోడ్డు, చెన్నై-6లో ఉన్న వెస్ట్ ఆసియా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని స్వయంగా కానీ లేక 044- 28294789/28292850 నెంబర్లలో ఫోన్ ద్వారా కానీ సంప్రదించగలరు.

వెబ్దునియా పై చదవండి