మైక్రోబయాలజీ విద్యార్థులకు అవకాశాలు పుష్కలం

FileFILE
మైక్రోబయాలజీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిశోధన, డెవలప్‌మెంట్ లాబ్య్‌లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఫార్మాక్యుటికల్స్‌, ఫుడ్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్‌లోనూ వీరికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మైక్రోబయాలజీ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు చాలా మంది పీహెచ్‌డీ చేయడానికి విదేశాలకు వెళుతుంటారు. ఇలాంటి వారికి కొత్త ఔషదాన్ని కనుగొనే పరిశోధనా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలో ఫ్యాకల్టీ సభ్యులుగా స్థానం సంపాదించవచ్చు.

కాలేజీ లెక్చరర్స్‌‍‌లలో కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఏ ఉద్యోగం లభించక పోయినా మైక్రోబయాలజీ లేబొరేటరీలు స్వయంగా పెట్టుకుని గణనీయమైన ఆదాయాన్ని అర్జించవచ్చు. ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియట్ నుంచి ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిది.

ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో కనీసం యాభై శాతం మార్కులను సాధించివుంటే డిగ్రీలో మైక్రోబయాలజీ చేరవచ్చు. ఆ తర్వాత పీజీ మైక్రోబయాలజీ పూర్తి చేస్తే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి