మా అబ్బాయి క్రమంగా కోలుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ, చంద్రబాబుగారు నాకు ధైర్యం నూరిపోశారు. సింపూర్‌లో అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పించాలని అక్కడి హైకమీషన్‌కు దిశానిర్దేశం చేశారు. వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈ సందర్భంగా దేశంలోనూ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నా బాబు ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ మాద్యమాల ద్వారా న్యాయమూర్తులు, రాజకీయనాయకులు, సినీరంగ ప్రముఖులు, ఎం.ఎల్.ఎ.లు, ఎంపి.పీలు, లెజిస్టేటర్లు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మార్క్ కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మా అబ్బాయి కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా అందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. .అని పవన్ పేర్కొన్నారు.