సినిమా లేట్ అవుతున్నందుకు ఇబ్బంది ఏమీ లేదు. మీకు కావాల్సిన టైం తీసుకోండి. కానీ ఈ ఏడాది వస్తుందో లేదో చెప్పండి. అప్పుడు ఫ్యాన్స్ మిమ్మల్ని బాధ పెట్టరు అంటూ ఒక నెటిజెన్ మారుతిని ప్రశ్నించాడు. ఇందుకు మారుతి.. ” పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అదే పనిలో ఉంది. సీజీ ఔట్పుట్ త్వరగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మొత్తం నా ఒక్కడి చేతిలోనే లేదు. దయచేసి ఓపిక పట్టండిఅంటూ ట్వీట్ లు చేస్తున్నాడు.
ఫైనల్ గా షూటింగ్ గురించి చెబుతూ, కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. అలాగే సాంగ్స్ పిక్చరైజ్ చేయాలి అంటూ మారుతీ సమాధానమిచ్చారు. అందుకే అవికూడా త్వరగా దేవుడి ఆశీస్సులుంటే జరుగుతాయని ఈరోజు తిరుపతి, శ్రీకాళహస్తి తదితర ఆలయాలను సందర్శిస్తున్నారు.