బీహెచ్ఈఎల్‌లో జాబ్ రిక్రూట్మెంట్ 2022

మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (17:02 IST)
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో తాత్కాలిక ప్రాతిపదికన వెల్డర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఈ విధానం కింద మొత్తం 575 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bhel.com/ అనే వెబ్‌సైట్‍‌లో చూసుకోవచ్చు. 
 
గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల (Graduate Apprentice posts)కు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబర్‌ 7, 2022వ తేదీ రాత్రి 11 గంటల 45 నిముషాలకు ముగుస్తుంది. అప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022వ తేదీనాటికి 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
దరఖాస్తు సమయంలో జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు రూ.200లు చొప్పున అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.40,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. స్టైపెండ్‌ చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు