ఉచిత కుట్టు మిషన్ పొందడానికి ఇలా చేయండి..

గురువారం, 14 జులై 2022 (17:43 IST)
Free Silai Machine Yojana
ఆర్థికంగా స్థిరపడటానికి మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలోని 50వేల మంది మహిళలకు ఈ పథకాన్ని వర్తింప చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
 
పథకానికి అర్హులు..
దేశంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 20 నుంచి 40 మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా దరఖాస్తుదారు భర్త వార్షికాదాయం రూ.12వేలకు మించకూడదు. వితంతువులు, దివ్యాంగులు కూడా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
 
ఉచిత కుట్టు మిషన్ పొందడానికి అవసరమైన పత్రాలు..
1. ఆధార్ కార్డు, 2. పుట్టిన తేదీ సర్టిఫికెట్, 3. ఆదాయ ధృవీకరణ పత్రం, 4. పాస్‌పోర్ట్ సైజు ఫొటో, 5. మొబైల్ నెంబర్
 
దరఖాస్తు విధానం..
 
అర్హత కలిగిన మహిళలు ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.india.gov.inకి వెళ్లాలి.
 
వెబ్‌సైట్ హోమ్ పేజీలో, కుట్టుపని ఉచిత సరఫరా కోసం అప్లై చేయడానికి లింక్‌ను క్లిక్ చేయాలి.
 
అందులో ఇచ్చిన వివరాలు నింపాలి.
 
తర్వాత అధికారులు దర్యాప్తు చేసి, దరఖాస్తులో ఇచ్చిన సమాచారం సరైనదా, కాదా అని నిర్ణయిస్తారు.
 
ఇచ్చిన సమాచారం సరైనది అయితే ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వబడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు