ఈఏపీసెట్ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

గురువారం, 20 జులై 2023 (14:00 IST)
ఈఏపీసెట్ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జులై 24 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు గరిష్ఠంగా రూ.లక్ష, కనిష్ఠంగా రూ.42 వేలు నిర్ణయించినట్లు కన్వినర్‌ తెలిపారు. ఈ ఏడాది నుంచి అంటే 2023-24 నుంచి మూడేళ్లపాటు ఇదే ఫీజులు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
 
జులై 24 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వుంటుంది. జులై 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని, ఆగస్టు 12న సీట్ల వివరాలకు సంబంధించిన జాబితా ప్రకటన వుంటుందని నాగరాణి ప్రకటించారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆగస్టు 13, 14 తేదీల్లో సీట్లు పొందిన కాలేజీల్లో తప్పనిసరిగా చేరాల్సి ఉంటుందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు