రిజిస్ట్రేషన్ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగినై ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ 2022 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అర్హత మార్కుల్లో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు.
కాగా.. 2022-23 విద్యాసంవత్సరానికిగానూ పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29న రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. వీరంతా ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ 2022 కోసం ఎదురు చూడాల్సివుంది.