సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ ఉదయం సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు results.cbse.nic.in లేదా cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది.
వీటితో పాటు డిజిలాకర్, పరీక్షా సంగమ్ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రూల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. అయితే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం దాపు 21 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.