ప్రొటెక్టివ్‌ హెడ్‌ గేర్‌ (హెల్మెట్స్‌) విడుదలతో కన్స్యూమర్‌ విభాగంలో ప్రవేశించిన స్పార్క్‌ మిండా

గురువారం, 21 జులై 2022 (23:45 IST)
స్పార్క్‌ మిండా గ్రూప్‌కు  ప్రతిష్టాత్మక విభాగమైన మిండా కార్పోరేషన్‌ లిమిటెడ్‌ 17 హెల్మెట్‌ మోడల్స్‌ను 145 వేరియంట్లలో భారతీయ రిటైల్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఆవిష్కరణతో  అంతర్జాతీయంగా  అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశపు హెల్మెట్‌ మార్కెట్‌లో బీ2సీ విభాగంలో స్పార్క్‌ మిండా ప్రవేశించినట్లయింది.

 
రాబోయే కొద్ది సంవత్సరాలలో ఈ కంపెనీ 200కు పైగా డిస్ట్రిబ్యూటర్లును జోడించడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే దేశ వ్యాప్తంగా స్పార్క్‌ మిండా బ్రాండెడ్‌ ఔట్‌లెట్లను తెరవడం ద్వారా తమ పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయనుంది. ఈ ప్రొటెక్టివ్‌ హెడ్‌ గేర్‌  మూడు వినియోగదారుల విభాగాలు – ఎకనమీ (నైట్‌ సిరీస్‌), మిడ్‌ (గారిసన్‌ సిరీస్‌) మరియు ప్రీమియం (ఆర్మోరెడ్‌ సిరీస్‌) –లో లభిస్తాయి.

 
స్పార్క్‌మిండా ఇప్పుడు  1500 ఫైబర్‌ భాగాలు (ప్లాస్టిక్‌- మౌల్డెడ్‌, పెయింటెడ్‌ విడిభాగాలను ద్విచక్రవాహనాల కోసం ) విడుదల చేసినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ద్విచక్రవాహన రైడర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను ఇవి తీర్చనున్నాయి. ఈ సంఖ్యను రాబోయే రెండు సంవత్సరాలలో 2400కు చేర్చనున్నారు. తద్వారా దేశంలో అతిపెద్ద శ్రేణి ఫైబర్‌ భాగాల లభ్యతకు ప్రాతినిధ్యం వహించనుంది.

 
మిండా కార్పోరేషన్‌ లిమిటెడ్‌  ఛైర్మన్‌ మరియు గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌  అశోక్‌ మిండా మాట్లాడుతూ… ‘‘గత ఆరు దశాబ్దాలుగా స్పార్క్‌ మిండా ఆటోమోటివ్‌ పరిశ్రమలో అగ్రగామి పరిష్కారాలను అందిస్తుంది. గ్రూప్‌ యొక్క అనుభవంతో పాటుగా విస్తృతశ్రేణి పరిశోధనలు సైతం మిళితమై భవిష్యత్‌ కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేసే విషయంలో  మిగిలిన సంస్థల కంటే ముందుంది’’ అని అన్నారు.

 
‘‘భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్ధ ఇండియా.  వినియోగదారుల వ్యాపార విభాగంలో మా ప్రవేశం, దేశంలో ఈ వృద్ధి కథలో మేము కూడా భాగమయ్యే అవకాశం కల్పించడమే కాదు, దేశ వ్యాప్తంగా ద్విచక్ర వాహన రైడర్ల కోసం అత్యున్నత  నాణ్యత ప్రమాణాలతో కూడిన భద్రతను సైతం అందిస్తున్నాం’’ అని ఆయన జోడించారు.

 
మిండా కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ఆఫ్టర్‌ మార్కెట్‌ డివిజన్‌  సీఈవో  శ్రీ నీరజ్‌ శరణ్‌ మాట్లాడుతూ : ‘‘ప్రపంచంలో అతి పెద్ద హెల్మెట్‌ మార్కెట్‌ గా ఇండియా నిలుస్తోంది. ఇక్కడ ఇప్పటికీ 40-45% అవసరాలను అసంఘటిత రంగంలోని సంస్థలే తీరుస్తున్నాయి. ఈ విస్తృత శ్రేణి ఉత్పత్తి శ్రేణి  గణనీయయైన మార్పులను తీసుకురావడంతో పాటుగా హెల్మెట్‌ విభాగంలో  అగ్రగామి ప్లేయర్లలో  ఒకటిగా ఇది నిలువనుంది. భారతదేశంలో ప్రతి ద్విచక్రవాహనదారునికీ సర్టిఫైడ్‌ హెల్మెట్స్‌ లభ్యమవుతాయనే భరోసా అందిస్తున్నాము. మరింత ముందుకు వెళ్తే, ఈ కంపెనీ ఇప్పుడు తమ మర్చండైజ్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో పాటుగా నూతన శ్రేణి ఉత్పత్తులను సైతం ఆవిష్కరించాము. ఇవి దేశంలో మా ద్విచక్రవాహన రైడర్లకు భారీ శ్రేణి ఫైబర్‌ భాగాలను సైతం అందించనున్నాయి’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు