క్లాట్ 2023 నోటిఫికేషన్ విడుదల.. నవంబర్‌ 13 వరకు అప్లై చేసుకోవచ్చు..

శనివారం, 22 అక్టోబరు 2022 (12:36 IST)
Law
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2023 నోటిఫికేషన్ విడుదలైంది. క్లాట్‌ 2022 ప్రవేశ పరీక్ష డిసెంబర్‌ 18, 2022వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. క్లాట్‌ 2023 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా 22 ప్రధాన లా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. 
 
దేశవ్యాప్తంగా ‘లా’ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ టెస్టును రాయాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌, 10+2 తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. 
 
ఇకపోతే 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా క్లాట్‌ ప్రవేశ పరీక్ష (యూజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్ధులు/ ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు క్లాట్‌ ఎల్‌ఎల్‌ఎమ్‌ (పీజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో నవంబర్‌ 13, 2022వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌ఎల్‌యూ విద్యార్ధులకు సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు