ఇందులోభాగంగా, సెప్టెంబర్ 15, 16, 23, 25 తేదీల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ప్రవేశపరీక్ష ద్వారా సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్‌గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశపరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నది.
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ తమిళనాడు, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కర్ణాటక, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కేరళ, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ గుజరాత్, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ హర్యానా, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ జార్ఖండ్, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ పంజాబ్, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ రాజస్థాన్, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ సౌత్ బీరార్, అస్సాం యూనివర్సిటీ, సిల్సార్‌లు ఉండగా, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోదలచిన వారు cucet.nta.nic.in, nta.ac.in అనే వెబ్‌సైట్‌లో చేసుకోవాల్సి ఉంటుంది.