ఇండియన్ బ్యాంకులో సెక్యూరిటీ ఉద్యోగాలు

బుధవారం, 30 అక్టోబరు 2019 (12:45 IST)
ఇండియన్ బ్యాంకులో సెక్యూరిటీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో, రక్షణ శాఖలో పని అనుభవం వున్నవారు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా చేసుకోవచ్చు. 115 సెక్యూరిటీ గార్డుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

దరఖాస్తులను నవంబర్ 8వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి వుంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, స్థానిక బాషా పరిజ్ఞానం, దేహదారుఢ్య పరీక్ష ద్వారా పరీక్షలు జరుగుతాయి. 
 
అర్హత : పదో తరగతి
జీతం : 9,560/-
వయోపరిమితి : 18-26 ఏళ్ళు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు