ఇంటర్ పరీక్షలను రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులు చేస్తూ ఈ ఏడాది జూన్ 24న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా జిల్లాలో 53 వేల మంది పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. అయితే, కొందరు విద్యార్థులు మార్కుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఇలాంటి విద్యార్థులు ఇంప్రూమెంట్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించారు. వీరి కోసం ఈ నెల 15 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు తొలి ఏడాదికి, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరానికి పరీక్షలు జరుగనున్నాయి.