రాగల 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించి, ఆ తరువాత 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు వివరించింది. రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
21 జిల్లాల్లో అధిక వర్షపాతం (20 నుంచి 50 శాతం మధ్యలో) నమోదు కాగా, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఏ ఒక్క జిల్లాల్లోనూ వర్షపాతం లోటు లేదు. జూన్ 5వ తేదీన రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించాయి. ఇప్పటికీ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 95 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76 శాతం, వరంగల్ అర్బన్‌లో 75 శాతం, నారాయణపేటలో 72 శాతం, కరీంనగర్ జిల్లాలో 64 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది.