ఇందుకు ఫీజు చెల్లింపునకు ఏడోతేదీన తేదీ సాయంత్రం 5గంటల వరకు అవకాశముంది. మే 17న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుందని పేర్కొంది. జూన్ 8న పరీక్షల ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించింది.
ఈసారి జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ స్టూడెంట్స్‌ని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా తీసుకుంటామని పేర్కొంది. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నిజమాబాద్, వరంగల్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.