దీపావళి స్పెషల్: కొబ్బరిమైసూర్ పాక్ తయారీ విధానం..
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:12 IST)
కావలసిన పదార్థాలు :
సెనగపిండి - ఒక కప్పు,
కొబ్బరితురుము - ఒక కప్పు
పాలు - ఒక కప్పు,
నెయ్యి - ఒక కప్పు,
పంచదార - రెండు కప్పులు,
జీడిపప్పు - అలంకరణకు
తయారు చేసే విధానం :
మొదట బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో సెనగపిండి వేయించి, కమ్మని వాసన వచ్చిన తర్వాత ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక అందులో పంచదార, కొబ్బరితురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసి పొయ్యిమీద పెట్టాలి.
మధ్యమధ్యలో కరిగించిన నెయ్యిని చేర్చుతూ బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మిశ్రమం సిద్ధమయ్యాక నెయ్యిరాసిన పళ్లెంలోకి తీసుకొని భాగాలు భాగాలుగా కట్‌చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పుతో అలంకరించుకోవాలి. అంతే ఏంతో నోరూరించే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే.