హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు..

బుధవారం, 3 జూన్ 2020 (20:40 IST)
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
 
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2020 జూన్ 22. దరఖాస్తు చేసుకోవడానికి careers.ecil.co.in/ వెబ్‌సైట్‌ను చూడండి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యాంఖాలు క్రింద పేర్కొనబడ్డాయి.
 
* టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం- 12
* దరఖాస్తు ప్రారంభ తేదీ - 2020 జూన్ 1
* దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 2020 జూన్ 22 సాయంత్రం 4 గంటలు
* విద్యార్హత - కంప్యూటర్ సైన్స్‌లో 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ. 
* ఏడాది అనుభవం తప్పనిసరి.
* వేతనం - రూ. 23,000.
* ఎంపిక విధానం - రాతపరీక్ష, ఇంటర్వ్యూ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు