రికార్డు స్ధాయిలో ఎన్‌టీఎస్‌ఈలో అర్హత సాధించిన 440 మంది ఆకాష్-బైజూస్‌ విద్యార్థులు

గురువారం, 3 మార్చి 2022 (23:16 IST)
ఆకాష్‌-బైజూస్‌ విద్యార్థులు 440 మంది జాతీయ స్థాయిలో ఎన్‌టీఎస్‌ఈ 2021 స్కాలర్‌షిప్‌ కోసం అర్హత సాధించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కాలర్‌షిప్‌ పరీక్ష ఇది. హైదరాబాద్‌ నుంచి ఆకాష్‌ విద్యార్థులు అథర్య, ప్రతీక్‌ బోస్‌, హిమానీ చండ్రు, రెడ్డిపోగుల రాహుల్‌ రాజ్‌, మణిదీప్‌ రామ్‌ రాముడు, మోనిషా గౌడ్‌ బడుగు, బస్వరాజ్‌ అనూష్క, గార శివాన రియా ఈ పరీక్షలో అర్హత సాధించడంతో పాటుగా ఎన్‌టీఎస్‌ఈ 2021 స్కాలర్‌షిప్‌ సాధించారు.

 
ఈ ఫలితాలను గురించి ఆకాష్‌-బైజూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకాష్‌ చౌదరి మాట్లాడుతూ, ‘‘ఈ సంవత్సర ఫలితాలు అసాధారణం. మా విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఈ ఫీట్‌ సాధించడానికి తీవ్రంగా శ్రమించారు. ఎన్‌టీఎస్‌ఈ స్టేజ్‌ 2లో 440 మంది ఎంపికయ్యారు. ఇప్పటివరకూ ఇది అత్యధికం. అందరికీ అభినందనలు’’ అని  అన్నారు.

 
ప్రతి సంవత్సరం దాదాపు 2 వేల స్కాలర్‌షిప్‌లను ఎన్‌టీఎస్‌ఈలో భాగంగా దేశవ్యాప్తంగా అందిస్తున్నారు. వీటిలో 15% ఎస్‌సీలకు, 7.5% ఎస్‌టీలు,  27%బీసీలకు 4% దివ్యాంగులకు కేటాయిస్తుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు