మహిళా వర్శిటీ లా విభాగంలో స్పాట్ అడ్మిషన్స్

గురువారం, 22 ఏప్రియల్ 2021 (16:11 IST)
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లా విభాగంలో మిగిలి ఉన్న (మూడేళ్ళ కోర్స్‌లో 13 సీట్లు, ఐదేళ్ల కోర్సులో 4 సీట్లు) ఖాళీసీట్లకు 26వ తేదీన తొలిదశ, 30 వతేదీ చివరగా స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. 
 
ఏపీ లాసెట్‌లో ఉత్తీర్ణులైన  విద్యార్థినులు, లా మూడేళ్ళ కోర్స్ లేదా ఐదేళ్ల  కోర్సులోకానీ ప్రవేశం పొందదలుచుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్‌, (పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, కులం, బదిలీ, స్టడీ సర్టిఫికేట్లతో పాటు.. ఆధార్ కార్డు, ఏపీ లా సెట్ ర్యాంకు కార్డు. హాల్‌టిక్కెట్) తీసుకొని పద్మావతి మహిళా యూనివర్సిటీ, లా విభాగమునందు 26 లేదా 30వ తేదీన స్పాట్ అడ్మిషన్‌కు  హాజరై లా కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. అయితే, ఈ కోర్సుల్లో చేరేవారికి హాస్టల్ సదుపాయం లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు