కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు... వేతనం రూ.1.12 లక్షలు

గురువారం, 27 జులై 2023 (11:16 IST)
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ జారీ విడుదలైంది. వివిధ విభాగాల్లో మొత్తం 1324 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
అర్హతలు : గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టులకు డిప్లొమా (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా తప్పనిసరి.
 
వయో పరిమితి : పోస్టులకు అనుగుణంగా కొన్ని పోస్టులకు 30 ఏళ్లు, మరికొన్నింటికి 32 ఏళ్లు వయో పరిమితి విధించారు. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి.
 
వేతనం : ఏడో వేతన స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 చెల్లిస్తారు. 
 
ఎంపిక విధానం : పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు / శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు.
 
దరఖాస్తు ఫీజు : రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు) దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఆగస్టు 17, 18 తేదీల వరకు గడువు ఇచ్చారు. అక్టోబరులో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1) జరిగే అవకాశం ఉంది.
 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలివే : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు