అయితే, ఈ పరీక్ష కోసం హాజరయ్యే విద్యార్థులకు అనేక నిబంధనల28ను విధించారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు విధిగా తమ వెంట అడ్మిట్ కార్డును తీసుకుని వెళ్లాల్సివుటుంది. ఈ కార్డు లేకుంటే మాత్రం పరీక్షా హాలులోకి అనుమతించరు.
అలాగే, అభ్యర్థులు పెన్ను, పెన్సిల్‌తో పాటు పారదర్శకంగా ఉండే వాటర బాటిళ్లను మాత్రమే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, పరీక్షకు హాజరైన అభ్యర్థులను శరీర ఉష్ణోగ్రతను పరీక్షించిన తర్వాతే పరీక్షా హాలులోకి అనుమతించారు. పరీక్ష ముగిసిన తర్వాత జేఈఈ అడ్మిట్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌ను పరీక్షా ఇన్విజిలేటర్‌కు అందజేయాల్సివుంటుంది.